రిటైర్డ్ ఉద్యోగులకు జగన్ షాక్..

రిటైర్డ్ ఉద్యోగులకు జగన్ షాక్..

పలు శాఖల విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలు అందిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.మార్చి 31వ తేదీకీ ముందు పేపర్ నోటిఫికేషన్, సంబంధిత నియామక ప్రక్రియక ద్వారా కాకుండా నియమితులైన రూ. 40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, డివిజన్,మండల, గ్రామ స్థాయి కార్యాలయాలతో పాటు కార్పోరేషన్లు, స్వయంపత్రిపత్తి గల సంస్థలకు కూడా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.ఈ నెల 31వ తేదీ లోపు తగిన చర్యలు తీసుకుని సంబంధిత నివేదికలను సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు.ఉత్తర్వులను సకాలంలో అమలు చేయకపోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos