మోడీపై కఠిన చర్యలు తీసుకోండి

మోడీపై కఠిన చర్యలు తీసుకోండి

న్యూఢిల్లీ : రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఎన్నికల ప్రసంగంపై సీపీఐ (ఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును, ఎన్నికల కమిషన్ను కోరింది. మోడీ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. ‘మోడీ వ్యాఖ్యలు దారుణం. ఎన్నికల కమిషన్ మౌనం మరింత దారుణం. రెచ్చగొట్టేలా సాగిన మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఇది ఉల్లంఘిస్తోంది. ఇది కఠిన చర్యలకు, కోర్టు ధిక్కరణకు యోగ్యమైనది’ అని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ‘ఘర్షణలు రేకెత్తించేలా ఉన్న మోడీ ప్రసంగాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఏచూరి కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos