జ‌గ‌న్ అలా..కార్య‌కర్త‌లు ఇలా

జ‌గ‌న్ అలా..కార్య‌కర్త‌లు ఇలా

పాద‌యాత్ర ముగిసింది. జ‌గ‌న్ శ్రీవారి ద‌ర్శ‌నం కోసం తిర‌ప‌తి వ‌చ్చారు. అలిపిరి నుండి కాలిన‌డ‌క తిరుమ‌ల చేరుకు న్నారు. విఐపి ద‌ర్శ‌నానికి అవ‌కాశం ఉన్నా..టిక్కెట్ తీసుకొని సాధార‌ణ ద‌ర్శ‌నానికి జ‌గ‌న్ వెళ్లారు. దీని ద్వారా సాధార ణ భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావ‌న‌. అంత వ‌రకు బాగానే ఉంది. ఇక‌, జ‌గ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చేసిన హ‌ల్‌చ‌ల్ ఇప్పుడు ప్ర‌ధానంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ త‌న ఇమేజ్ పెంచుకోవ‌టం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు..ఇటువంటి లోపాల‌తో డామేజ్ అవుతోంది. ఇంత‌కీ..ఈ లోపం ఎక్క‌డ‌..

సుదీర్ఘ పాద‌యాత్ర అనంత‌రం గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగానే తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. పాద‌యాత్ర కు ముందు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. పాద‌యాత్ర పూర్త‌వ‌గానే కాలిన‌డ‌క‌న శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌స్తాన‌ని అప్ప‌ట్లోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే విధంగా తిరుప‌తి చేరుకొని.. అలిపిరి చేరుకున్నారు. తొలి మెట్టుకు మొ క్కి వైఎస్‌ జగన్‌ నడక ప్రారంభించారు. పాదరక్షలు లేకుండా నడుస్తూ.. దారి పొడవునా శ్రీవారిని ధ్యానిస్తూ.. గోవిందా.. గోవిందా.. శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ.. భక్తి ప్రపత్తులతో వడివడిగా మెట్లు ఎక్కారు. దారిలో ఎక్కడా విశ్రమించకుండా ముందుకు సాగారు. కాలినడకన వచ్చే భక్తులకు దర్శనం కోసం ఇచ్చే దివ్యదర్శనం టోకెన్‌ను సామాన్య భక్తుడిగా వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. త‌న కార‌ణంగా సామాన్య భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కూద‌నే ఉద్దేశం తో జ‌గ‌న్ ఒక సామాన్య భ‌క్తుడిలాగానే తిరుప‌తి లో వ్య‌వ‌హ‌రించారు. సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా దివ్యదర్శనం టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు.

సంప్ర‌దాయాల‌కు విలువిస్తూ..
శ్రీ వారి స‌న్నిధిలో.. జ‌గ‌న్ తిరుమ‌ల లో పూర్తిగా సంప్ర‌దాయాల‌ను పాటించారు. సాంప్ర‌దాయ వ‌స్త్ర ధార‌ణ‌లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా దివ్యదర్శనం టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తం భానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం.. ఆనంద నిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని అన్నమయ్య భాండాగారాన్ని సందర్శించారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. అయితే, జ‌గన్ ద‌ర్శ‌నానికి ఎక్క‌డా ఇబ్బంది లేకుండా టిటిడి అధికారులు ఏర్పాట్లు చేసారు. క్యూ లైన్లో జ‌గ‌న్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసారు. శ్రీవారి ద‌ర్శ‌నం స‌మ‌యంలోనూ జ‌గ‌న్ శ్రీవారిని క‌నులారా ద‌ర్శించుకున్నారు.

జ‌గ‌న్ అలా..కార్య‌క‌ర్త‌లు ఇలా..
ఒక వైపు భ‌క్తులకు ఇబ్బంది లేకుండా..ప‌విత్ర‌మైన తిరుమ‌ల లో విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. పూర్తిగా తిరుమ‌ల సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ తిరుమ‌ల లో వ్య‌వ‌హ‌రించి న తీరు.. సాధార‌ణ భ‌క్తుడి వ‌లే ముందుకు సాగిన విధానం అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే, ఇదే స‌మ‌యం లో కొంద‌రు జ‌గ‌న్ అభిమానులు వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. కాలి న‌డ‌క‌న వ‌స్తున్న స‌మ‌యంలో మెట్లు ఎక్కుతున్న ప్రారంభంలోనే జై జ‌గ‌న్ నినాదాలు చేసారు. శ్రీవారి ఆల‌యం లోకి వెళ్లే క్యూ కాంప్లెక్స్ లోనూ జ‌గ‌న్ అభిమానుల ర‌ద్దీ క‌నిపించింది. కొంద‌రు చేసిన అత్యుత్సాహం కార‌ణంగా సాధార‌ణ భ‌క్తుల ద‌ర్శ‌నం ఆల‌స్య‌మైంద‌ని టిటిడి అధికారులు చెబుతున్నారు. అయితే, స్థానికంగా వ‌చ్చిన అభిమానులు జ‌గ‌న్ తో క‌లిసి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే ఉత్సాహంతో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అయితే, జ‌గ‌న్ వ్యవ‌హార శైలి పై అభినంద‌నలు వ‌స్తున్న స‌మ‌యంలో నే కొందరు కార్య‌క‌ర్త‌ల తీరు కార‌ణంగా..విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి..దీనికి లోపం ఎక్క‌డ‌..జ‌గ‌న్ వెంట ఉన్న నేత‌లు ఏం చేస్తున్నారు..అనేది విశ్లేష‌ణ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos