జగన్‌కు శిక్ష తప్పదు

జగన్‌కు శిక్ష తప్పదు

మంగళగిరి: నగదు అక్రమ బదిలీ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి శిక్ష తప్పదని తెదేపా సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు అన్నారు. శనివారం ఇక్కడ పార్టీ కచ్చేరీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘11 అభియోగ పత్రాలపై విచారణ మొదలై బోనులో ఉంటే ప్రజలు అసహ్యించుకుంటారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేయవచ్చా అని ప్రశ్నించారు. వికేంద్రీకరణ సాధారణ ముసాయి దాగావచ్చి ద్రవ్య ముసాయిదాగా మారింది. మంత్రులు అసలు ముసాయిదాల్ని చదువుతున్నారా? లేదా? అన్న అను మానం కలుగు తోంది. ఎస్సీ కమిషన్, ఆంగ్ల మాధ్యమం ముసాయి దాలు సాధారణ ముసాయి దాలుగా వచ్చాయి. సాధారణ, ద్రవ్య ముసా యి దాల పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. మూడు రాజధానుల ముసా యిదా ద్రవ్య ముసాయిదానా? సాధారణ ముసాయి దానా? అని న్యాయస్థానం అడిగింది. బిల్లులో కొన్ని సవరణలతో దాన్ని ఎంపిక సమితికి పంపా రు. శాసనసభ అనంతరం మండలిలో ముసాయిదాపై చర్చి స్తారు. ప్రజాభిప్రాయంతోచేయాల్సిన నిర్ణయాలు ఇష్టానుసారం చేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారం చేసుకుపోవచ్చా’ని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos