చరిత్రలో అదో చిన్న ఘటన

చరిత్రలో అదో చిన్న ఘటన

న్యూ ఢిల్లీ: గత జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణను చైనా ప్రతినిధి సున్ వీడోంగ్ చాలా చిన్నదిగా అభివర్ణించారు. గత 18న నిర్వహించిన చైనా – ఇండియా యూత్ వెబినార్ లో ఆయన ప్రసంగించారు. ‘ఇది అవాంఛనీయ ఘటన. రెండు దేశాల ఘనమైన చరిత్రలో ఇది మరీ అతి చిన్నది. విభేదాలు పరిష్కరించుకుని ముందుకు సాగాల్సిన సమయమ’ని పేర్కొన్నారు. చైనా రాయబారి కచ్చేరీ ఆయన ప్రసంగాన్ని మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. ‘ఎంతో కాలం కిందట కాదు. ఇటీవలే దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనే ఇది. సరిహద్దుల్లో చైనా, ఇండియా దీన్ని ఆహ్వానించ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా పరిష్కరించాలి. మన దేశాల చరిత్రలో ఇది ఓ అతి చిన్న ఘటనగానే తీసుకోవాలి. ఇండియాను ప్రత్యర్థిగా చైనా చూడటం లేదు. ఇదే సమయంలో భారత్ నుంచి ముప్పు ఉందని కూడా అనుకోవడం లేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos