తారక్‌ ఫ్యాన్స్‌ ఆశలపై డీఫ్రీజ్ నీళ్లు పోశారు..

  • In Film
  • May 18, 2020
  • 143 Views
తారక్‌ ఫ్యాన్స్‌ ఆశలపై డీఫ్రీజ్ నీళ్లు పోశారు..

లాక్‌డౌన్‌ కారణంగా రాజమౌళి తెరకకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.అయితే చిత్రంపై హైప్‌ సన్నగిల్లకుండా ఉండాలనే ఉద్దేశంతో రామ్‌చరణ్‌ పుట్టినరోజును వీడియో విడుదల చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.అదే సమయంలో తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 20వ తేదీన మరో వీడియో విడుదల చేయాలని భావించింది.దీంతో తమ అభిమాన హీరో వీడియో ఎలా ఉంటుందోనని తారక్‌ అభిమానులు వీడియో కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో చేయడం సాధ్యం కాకపోవడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం అందుకు సంబంధించి పోస్ట్‌ విడుదల చేసింది.లాక్డౌన్ను మరోసారి పొడిగించారు.. పనులు ఆగిపోయాయి.. అయినప్పటికీ మేము వీలైనంత ప్రయత్నించాం. తారక్ బర్త్ డేకి ట్రీట్ఇవ్వాలని భావించాం. కానీ, ‌ వీడియోకు సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయాంఅంటూ ఆర్ఆర్ఆర్ప్రకటన చేసింది. దీంతో ఎన్టీఆర్బర్త్డేకు వీడియోగానీ, ఫస్ట్లుక్గానీ విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.ఏదో ఒకటి విడుదల చేసేయాలన్నది తమకు ఇష్టం ఉండదని, మీ ఎదురుచూపులకు తగ్గా రీతిలో అది ఉంటుందని ప్రామిస్ చేస్తున్నామని పేర్కొంది. అది ఎప్పుడు వచ్చినా, మనందరికీ ఒక పెద్ద పండగలా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తెలిపింది. అయితే, ప్రకటనపై ఎన్టీఆర్అభిమానులు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos