ఇరాన్-అమెరికా యుద్ధం భారత్ బాగా నష్టం

ఇరాన్-అమెరికా యుద్ధం భారత్ బాగా నష్టం

న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే భారత్ బాగా నష్ట పోనుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో వర్క్ పర్మిట్లు కలిగిన వారితో సహా మొత్తం 80 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధం వల్ల వారి భద్రతకు ముప్పు కలగ నుంది. 1990 దశకంలో అమెరికా, ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రత్యేక విమానాల ద్వారా 1,10,000 మంది భారతీ యులను ఢిల్లీ తరలి వచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగిన భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తప్పదు. సౌదీ అరేబియా, ఖతార్ మధ్య గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రాంతీయ ఘర్షణల వల్ల వేలాదిగా ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పో యారు. కేరళ నుంచి వెళ్లిన లక్షలాది మంది భారతీయుల్లో అనేకులు అప్పుడే తిరుగు ముఖం పట్టారు. ప్రవాస భారతీ యులు ఎక్కువ మంది వెను తిరిగి వస్తే ఏటా కేంద్రానికి వచ్చే నాలుగు వేల కోట్ల డాలర్ల సొమ్మును భారత్ కోల్పోతుంది. భార త్కు లభిస్తున్న విదేశీ మారక ద్రవ్యంలో ఇది యాభై శాతానికంటే ఎక్కువ. ఇరాన్ మిలటరీ కమాండర్ సులేమానిని హత్యతో అంతర్జాతీయ చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయి. గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే హోర్ముజ్ జల సంధి యుద్ధం కారణంగా మూసుకుపోతే చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఆహార పదార్థాల ధరలు ఆకా శా నంటుతాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఆర్థిక పరిస్థితి  కూలింది.  ద్రవ్యో ల్పణం పెరిగింది. జీడీపీ పడిపోయి, వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో అమెరికా–ఇరాన్ యుద్ధం అనివార్యం అయితే దాన్ని ఆపేంత శక్తి కూడా భారత్‌ కు లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos