డిజిటల్ ఓటర్ కార్డులు రానున్నాయి

డిజిటల్ ఓటర్ కార్డులు రానున్నాయి

న్యూఢిల్లీ : ఆధార్  మాదిరే వోటరు గుర్తింపు పత్రాల్ని డిజిటల్ రూపంలో అందించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభల  ఎన్నికలకు ముందే ఇవి ఆ యా రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.  దీని వల్ల ఓటర్లు తమ ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదయ్యే ఓటర్ల  గుర్తింపు పత్రాలు ఆటోమేటిక్‌గానే తయారవుతాయి. ప్రస్తుత ఓటర్లు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, గుర్తింపు కార్డులు తయారవుతున్నాయి. 2021 ఏప్రిల్, మే నెలల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos