మా సిబ్బందిని ఆదుకోండి

మా సిబ్బందిని ఆదుకోండి

లండన్: తమ సంస్థ సిబ్బందిని ఆదుకోవాలని ఫరారైన ఆర్థిక నేరగాడు విజయ మల్య కేంద్రానికి ట్విట్టర్లో విన్నవించారు.’లాక్ డౌన్ వల్ల నా కంపెనీల కార్యకలా పాలన్నీ నిలిచిపోయాయి. ఉత్పాదన ఆగిపోయింది. మా సంస్థల సిబ్బందిని ఇంటికి పంపలేక పోతున్నాం. తగిన వేతనాలూ చెల్లించ లేకపోతున్నాం. ఉద్యోగులను ఇంటికి పంపించడానికి ప్రభుత్వం సహకరించాల’ని విన్నవించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తీసుకున్న రుణాలను చెల్లిస్తానని ఎన్నో మార్లు చెప్పా. బకాయి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. జప్తు చేసిన నా ఆస్తుల విడుదలకు ఈడీ కూడా ముందుకు రాలేదు. ఈ క్లిష్ట సమయంలో నా మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి వింటారని ఆశిస్తున్నాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos