ఈడీ దాడులతో ‘వివో’ డైరెక్టర్లు పరార్

ఈడీ దాడులతో ‘వివో’  డైరెక్టర్లు పరార్

న్యూ ఢిల్లీ: నగదు అక్రమ బదిలీ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేపట్టిన విస్తృత దర్యాప్తు వల్ల వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్షెన్ ఔ, చాంగ్ చియా చైనాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వివోకు చెందిన 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తున్నారు. త్ పై విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొంది. భారత్లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వాంగ్ జియాజియాన్ దీనిపై స్పందించారు. ‘వివో కార్యాలయాలపై ఈడీ సోదాల విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని ఎప్పు డూ మా దేశ కంపెనీలకు సూచిస్తున్నాం. భారత్ చైనా కంపెనీలే లక్ష్యంగా వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇవి ఆయా సంస్థల కార్యకలాపాలను, ప్రతిష్ఠను దెబ్బ తీస్తుంది. ఈ పరిణామాలతో భారత్లో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంద’ని హెచ్చరించారు. గతంలో షావోమి, వన్ప్లస్, జడ్టీఈ కంపెనీల్లో భారత్కు చెందిన దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఈడీకి విచారణలో తాము సహకరిస్తున్నామని వివో ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos