వివ్‌ రిచర్డ్స్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌శర్మ

  • In Sports
  • January 12, 2019
  • 176 Views
వివ్‌ రిచర్డ్స్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌శర్మ

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌శర్మ శతకంతో రాణించినా విజయానికి 34 పరుగుల దూరంలో భారత జట్టు ఆగిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే, 110 బంతుల్లో 100 పరుగులు (7 x 4, 4 x 6) సాధించిన రోహిత్‌ శర్మ తన వన్డే కెరీర్‌లో 22వ శతకాన్ని నమోదు చేశాడు. అంతేకాదు, వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ వివ్‌ రిచర్డ్స్‌ రికార్డను బద్దలు కొట్టాడు.

ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్‌శర్మ ఆడిన వన్డేల్లో అతడికిది నాలుగో శతకం. ఇప్పటివరకూ ప్రపంచ క్రికెట్‌లో ఏ ఆటగాడు ఆస్ట్రేలియాలో అదీ వన్డేల్లో నాలుగు శతకాలు చేయలేదు. దీంతో విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ వివ్‌ రిచర్డ్స్‌ పేరిట ఉన్న మూడు శతకాల రికార్డును రోహిత్‌శర్మ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆసీస్‌ గడ్డపై రెండు శతకాలు చేయగా, ఈ మ్యాచ్‌లో రాణించి ఉంటే, మూడు శతకాలు చేసిన వ్యక్తిగా నిలిచేవాడు. రెండో వన్డే ఈనెల 15న అడిలైడ్‌ వేదికగా జరగనుంది. ఈ ఏడాది జరగనున్న ఐసీసీ ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మానసికంగా మరింత బలంగా తయారవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ పండితుల విశ్లేషణ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos