బెంగాల్‌ పోలింగ్‌లో హింస

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు శనివారం తొలి దశ పోలింగ్‌ జరిగింది. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురవగా మరోచోట బీజేపీ నాయకుని కారుపై దాడి జరిగింది. కారును ధ్వంసం చేయడంతో పాటు ఆ నాయకుడిపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్ జిల్లా సత్సతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos