ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ తరపున ఆడు..

  • In Film
  • April 22, 2019
  • 160 Views
ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ తరపున ఆడు..

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన జెర్సీ బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో అర్జున్‌ రెడ్డి అలియాస్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా తన స్నేహితుడైన నానికి సూచన చేశాడు.ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున నాని ఆడాలంటూ ట్టిట్టర్‌లో సూచించాడు.జెర్సీ చిత్రం చూసిన అనంతరం విజయ్‌ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.”జెర్సీ సినిమా చూసిన తరువాత మాట రాలేదు. క్లాప్స్ కొట్టాను. నా ప్రేమ మొత్తం నీకే నాని. గౌతం తిన్ననూరి ఫ్యూచర్ లో మీరు చేయబోయే ప్రాజెక్ట్ ల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఫైనల్ గా.. నాని నువ్వు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాలి అంటూ ప్రశంసలు గుప్పించారు. గతంలో నాని, విజయ్ దేవరకొండ కలిసి ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఎవడే సుబ్రమణ్యం సినిమా అనంతరం నాని,విజయ్‌ల మధ్య స్నేహ బంధం బలపడింది.ఇక మొదటిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా సినిమా దూసుకుపోతుంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos