వ్యాయామం చేస్తే ఉచితంగా టిక్కెట్‌

వ్యాయామం చేస్తే ఉచితంగా టిక్కెట్‌

న్యూ ఢిల్లీ: ఇక్కడి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ముఖ్యోద్దేశం. అక్కడి ఆ ఫిట్ నెస్ యంత్రం పై కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలాఉ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా అందుతుంది.దీని వల్ల దేహ ధారుఢ్యంతో బాటు పొదుపు కూడా సాధ్యం అవుతుందని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఒక వీడియో కూడా పోస్టు చేశారు. రష్యాలో ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఉచితం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos