ఫరూక్ విముక్తికి వైగో న్యాయ పోరాటం

ఫరూక్ విముక్తికి వైగో న్యాయ పోరాటం

న్యూ ఢిల్లీ: గృహ నిర్బంధంలోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేయాలని కోరుతూ ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు వైగో బుధ వారం అత్యున్నత న్యాయ స్థానంలో హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘చెన్నైలో సెప్టెం బర్ 15న జరుగనున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత అణ్ణాదురై జయంత్యుత్సవంలో కార్యక్రమంలో అబ్దుల్లా పాల్గొనాల్సి ఉంది. జమ్మూ – కశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వల్ల కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో కర్ఫ్యూ విధించి కొందరు రాజకీయ నాయకులను నిర్బంధించింది. దీంతో ఆగస్టు 5 నుంచి అబ్దుల్లా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. డాక్టర్ అబ్దుల్లాను అత్యున్నత న్యాయస్థానంలో హాజరు పరిచేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. ఈ నెల 15న చెన్నైలో జరిగ నున్న సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా ఆయనకు స్వేచ్ఛ ప్రసాదించాల’ని వ్యాజ్యంలో కోరారు. డాక్టర్ అబ్దుల్లా చెన్నై వచ్చేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు ఇంత వరకూ సమాధానం రాలేదని వివరించారు. ‘జీవించే హక్కు, వ్యక్తి గత స్వేచ్ఛ, భద్రతా హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజా స్వామ్య దేశంలో హరించడం పూర్తిగా చట్ట వ్యతిరేకమని విమ ర్శించారు. జమ్మూ కశ్మీర్లో అప్రకటిత అత్యయిక పరిస్థితి విధించి కశ్మీరును గత నెల రోజులుగా దిగ్బంధంలో ఉంచారని దుయ్య బట్టారు. ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలను ప్రతి నిధులను అకారణంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమ’ని కేంద్రానికి వ్యతిరేకంగా ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos