తప్పులు సరిదిద్దుకోకపోతే చాలా కష్టం….

తప్పులు సరిదిద్దుకోకపోతే చాలా కష్టం….

అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తున్నారని వాటిని వెంటనే సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం తప్పదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సున్నితంగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం.ఢిల్లీ పర్యటనలో భాగంగా వైసీపీ ఎంపీలతో కలసి అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌ మొదటిసారి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు..ప్రాజెక్టుల విషయంలో సహకరించారని జగన్కోరారు. దీనికి ఉప రాష్ట్రపతి సైతం సమ్మతించారు. అదే సమయంలో వెంకయ్య నాయుడు సీఎం జగన్కు తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేశారు.అధికారంలోకి వచ్చాక చాలా విషయాల్లో తప్పులు చేస్తూనే ఉన్నారని వాటిని వెంటనే సరిదిద్దుకోవాలంటూ పలు విషయాలను వివరించి చెప్పినట్లు తెలుస్తోంది.అందుకు జగన్‌ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా వివరణలు కాకుండా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని లేదంటూ భారీ నష్టం తప్పదని కుండబద్దలు కొట్టేశారట.అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలో జగన్ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తావించి నట్లు సమాచారం. అధికారంలోకి రాగానే తీసుకుంటున్న నిర్ణయాలు తొందరపాటుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సమావేశంలోనే తెలుగు దేశం అయిదేళ్ల కాలంలో చేసిన తప్పుల వలన పార్టీ పరాజం పాలైన విషయాన్ని వెంకయ్య నాయుడు ప్రస్తావిం చారు. మీరు అవే తప్పులు చేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని జగన్తో చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఎవరు అధికారంలో ఉన్న నిర్మాణాత్మక రీతిలో పాలన చేస్తే తప్పకుండా సహకారం ఉంటుందని..అలా కాకుండా విధ్వంసక రీతితో పని చేస్తే సాయం చేయటం కష్టమంటూ వెంకయ్య నాయుడు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యల పైన సీఎం జగన్తో సహా అక్కడ ఉన్న నేతలు విస్మయానికి గురయ్యారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos