ఆధార్‌తో వోటరు పత్రం అనుసంధానం

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆధార్కార్డుతో వోటరు గుర్తింపు పత్రాన్ని కూడా అనుసంధానం చేయనుంది. ఇందుకు ఎన్నికల సంఘా నికి కేంద్ర న్యాయశాఖ అనుమతించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశ పెట్టనున్నట్లు న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఆధార్-వోటరు పత్రాల అనుసంధానం మొదలైతే ఇప్పటికే ఓటర్ కార్డు కలిగిన వారు ఆధార్ నంబరును సమ ర్పించాల్సి ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా ఆధార్ వివరాలను ఎన్నికల అధికార్లు కోరుతారు. ఆ వివరాలు ఇవ్వక పోయాని కొత్త కార్డు ఇవ్వకుండా నిరాకరించే, పాత కార్డును రద్దు చేసే హక్కు వారికి ఉండదు. దీని వల్ల నకిలీ వోటర్లు పత్రాల్ని ఏరివేయ వచ్చని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos