వెంకీమామ కథ లీక్‌!

  • In Film
  • December 9, 2019
  • 136 Views
వెంకీమామ కథ లీక్‌!

ఈనెల 13వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న వెంకటేశ్‌,నాగచైతన్య నటించిన వెంకిమామ చిత్రంపై ఇప్పటికే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో చిత్రంలో ముఖ్యమైన మలుపు,కథ లీక్‌ కావడం చర్చనీయాంశమైంది.పల్లెలో ఉండే వెంకటరత్నం అలియాస్ వెంకీకు తన మేనల్లుడు కార్తీక్ అంటే ప్రాణం. కార్తీక్ తల్లి,తండ్రులు చనిపోయిన నాటి నుంచి కార్తీక్ ని పెంచుతుంటాడు. అయితే వెంకీ ఇలా తన మేనల్లుడుని దగ్గరకు చేరతీయటం ఆయన తండ్రి,ప్రముఖ జ్యోతిష్యుడు రామ నారాయణ కు ఇష్టం ఉండదు. వద్దని వారిస్తాడు. అయినా వెంకీ తన మేనల్లుడు మీద ఈగ కూడా వాలనీయకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాడు. కార్తీక్ పెరిగి పెద్దవుతాడు. ఈ క్రమంలో మామయ్యతో మరింత స్నేహంగా, ప్రేమగా, ప్రాణంగా మెలుగుతూంటాడు.ఆ స్నేహం,బంధం ఎంత దాకా వెళ్తుంది అంటే ఒకరి కోసం మరొకరు అమ్మాయిని వెతుక్కునేంతవరకూ.ఇలాంటి పరిస్దితిల్లో కథకు వెంకీ తండ్రి రామ్ నారాయణ ఓ ట్విస్ట్ ఇస్తాడు. జాతకం ప్రకారం వెంకటేష్ మృతి…తన మేనల్లుడు కార్తీక్ చేతుల్లో రాసి పెట్టి ఉంది అని. అందుకే కార్తీక్ ని దూరం పెట్టమన్నాననే విషయం వివరిస్తాడు. అప్పుడు వెంకీ ఏం డెసిషన్ తీసుకుంటాడు. మిలిట్రీకు వెళ్లిన చైతు ఎందుకు తిరిగి వస్తాడు. వెంకీకి, కార్తీక్ కు మధ్య విభేధాలు ఏమి వస్తాయి , చివరకు ఏం జరుగుతుంది వంటి విషయాలతో కథ నడుస్తుంది. ఇక పాయల్‌ ఈ మూవీలో ఓ స్కూల్‌ టీచర్‌ రోల్‌ లో కనపడుతుంది.బుక్ మై షోలో ఇచ్చిన సినాప్సిస్ ప్రకారం ఈ ట్విస్ట్ బయిటకు వచ్చింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos