ఇళ్ల వద్దకే కూరగాయలు : జయకుమార్ రెడ్డి కృషి

ఇళ్ల వద్దకే కూరగాయలు :  జయకుమార్ రెడ్డి కృషి

హొసూరు : హొసూరు యూనియన్ చెన్నసంద్రం పంచాయతీలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఇళ్ల వద్దకే కూరగాయలు సరఫరా చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. రవాణా స్తంభించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు నిత్యావసరాలకు రోజూ తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నసంద్రం పంచాయతీలో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఇళ్ల వద్దకే కూరగాయలను సరఫరా చేయడానిక పంచాయతీ అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇళ్ల వద్దకే కూరగాయలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు కూరగాయల కోసం మార్కెట్లకు వెళితే, కరోనా ప్రబలే ప్రమాదం ఉందని,
దీనిని నివారించడానికి అందరికీ ఇళ్ల ముంగిటే కూరగాయలను సరఫరా చేస్తున్నామని వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని జయకుమార్ రెడ్డి సూచించారు. ఒక్క రోజులోనే వెయ్యి కుటుంబాలకు కూరగాయలను సరఫరా చేశామని ఆయన చెప్పారు. చెన్నసంద్రం పంచాయతీలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా వారానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పంచాయతీ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తి నిరోధానికి తమ వంతు కృషి చేయాలని జయకుమార్‌ రెడ్డి పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం