దిగొచ్చిన కూరగాయల ధరలు..

దిగొచ్చిన కూరగాయల ధరలు..

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలతోపాటు కిరాణా, మెడికల్ షాపులు తెరిచేందుకు మాత్రమే అనుతించింది. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు, వర్తకులు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. లాక్డౌన్ ఉన్న కాలంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటన విడుదల చేసింది.సరుకులను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాని హెచ్చరించింది. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు ప్రజలు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడానికి టాస్కోఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపింది. టోకు, చిల్లర వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుకోవాల్సిందే అని స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పింది. మేరకు కొన్ని సరుకులను గరిష్టంగా ఎంతకు విక్రయించాలో జాబితా విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేయడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. రోజు హైదరాబాద్లోని గుడి మల్కాపూర్‌, గడ్డి అన్నారం, కొత్త పేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ మార్కెట్లలో టమాటా కిలో రూ.30, పచ్చిమిర్చి రూ.50కే అమ్ముతున్నారు. వీటితో పాటు అన్ని కూరగాయల ధరలు తగ్గాయి. పలు రైతు బజార్లలో ప్రజల కొనుగోళ్లు పెరిగాయి. ఇంట్లో సరుకులు నింపి పెట్టుకోవాలన్న అత్యాశతో నిన్న మార్కెట్లలోకి ప్రజలు హడావుడిగా వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కున్నారు. మొన్న టమాటా కిలో ధర రూ. 8గా ఉండగా నిన్న వ్యాపారులు కిలో రూ.100కి అమ్మారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos