తిరు వళ్లువర్‌ కు అపచారం

తిరు వళ్లువర్‌ కు అపచారం

చెన్నై: తమిళనాడులోని పిళ్లయార్ పట్టిలో సోమవారం ఉదయం తమిళ కవి, తాత్వికుడు తిరువళ్లువర్ కు తీరని అవమానం జరిగింది. వళ్లు వర్ విగ్రహానికి ఆవు పేడ పూసి, కళ్లుకు గంతలు కట్టారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ద్రవిడ పార్టీలు డిమాండ్ చేశాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తంజావూరు జిల్లాలో తిరువళ్లువర్ కులం గురించి భాజపా మద్దతుదారులు, ద్రవిడ పక్షాల మధ్య వివాదం జరుగుతోంది. దీనికి, వళ్లువర్ విగ్రహానికి జరిగిన అవమానానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. తిరువళ్లువర్ చిత్రాల్లో ఇప్పటి వరకూ తెలుపు రంగు శాలువాలో కని పించే వారు. దీనికి భిన్నంగా ఆయన కాషాయం శాలువా కప్పుకున్న ఫోటోను ఇటీవల తమిళనాడు భాజపా యూనిట్ ట్వీట్ చేయడం వివాదానికి కారణం. తిరువళ్లువర్ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు తిరువాయూరు, తంజావూరు శాసనసభ్యులు దురై చంద్ర శేఖరన్, టీకేజీ నీల మేఘం సార థ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు చేపట్టారు. వివిధ తమిళ సంస్థల సభ్యులూ నిరసనలో పాల్గొన్నారు. తిరు వళ్లువర్ పెరవైకి చెందిన మహి ళలు ర్యాలీ నిర్వహించారు. తమిళ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయం ఎదుట నిరసించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos