వలెంటైన్స్ డే వయసెంత..?

వలెంటైన్స్ డే వయసెంత..?

ప్రేమికుల దినోత్సవంగా జరుపుకొనే
వలెంటైన్స్‌ డే మూడో శతాబ్దం నాటిదని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఏటా ఫిబ్రవరి
14న వలెంటైన్స్‌ డేను జరుపుకోవడం ఆనవాయితీ. వాలెంటైన్‌ అనే వ్యక్తి క్రైస్తవ ప్రవక్త
అని, మూడో శతాబ్దంలో అతను రోమ్‌ నగరంలో నివసించే వాడని చెబుతారు. అప్పట్లో రోమ్‌ పాలకులు
పెళ్లిళ్లను నిషేధించారు. పురుషులు పెళ్లి చేసుకుంటే, సంసార జీవితంలో పడిపోయి మంచి
సైనికులు కాలేరన్నది ఆ పాలకుల భావన. పెళ్లిళ్లపై నిషేధం వలెంటైన్‌కు నచ్చలేదు. దీంతో
ఆయన చక్రవర్తి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు. ఈ విషయం
చక్రవర్తికి తెలియడంతో అతనిని బంధించి, ఉరి శిక్ష విధించాడు. జైల్లో అతను జైలర్‌ కుమార్తెతో
ప్రేమలో పడ్డాడు. ఫిబ్రవరి 14న మరణ శిక్ష అమలు చేయడానికి ముందు వలెంటైన్‌ తన ప్రియురాలికి
ప్రేమ లేఖను పంపాడు. ఫిబ్రవరి 14న వలెంటైన్‌ మరణించడంతో అతని స్మృత్యర్థం ఉత్సవాన్ని
జరుపుకోవాలని చర్చి సూచించింది.  ఆ విధంగా పుట్టిందే…వలెంటైన్స్‌
డే.

తాజా సమాచారం