రాజకీయాల్లోకి ఉగ్రవాదులు-ఇదే పాలకుల ఆశయం

రాజకీయాల్లోకి ఉగ్రవాదులు-ఇదే పాలకుల ఆశయం

న్యూ ఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ని అవకాశవాద రాజకీయాలకు పావుగా వాడుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఇక్కడ విమర్శించారు. ‘ఫరూక్ వంటి నేతలను పక్కన బెట్టటంతో ఏర్ప డిన రాజకీయ శూన్యత ను ఉగ్రవాదులు భర్తీ చేసినపుడు కశ్మీర్ని అవకాశవాద రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నార’ని ధ్వజ మెత్తారు. . ‘అబ్దుల్లా వంటి నేతలు ఉగ్రవాదులు కారు. వారిని గృహ నిర్బంధంలో ఉంచడం దారుణమ’ని సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ కూడా దుయ్యబట్టారు. వైగో వ్యాజ్యం వల్లే అబ్దుల్లాను ఇప్పుడు అరెస్టు చేశారా అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. గత నెల 5న రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనకుమారుడు ఒమర్ అబ్దుల్లా, మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీనీ నిర్బంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos