‘మొదట నిన్ను నిర్లక్ష్యం చేస్తారు…చివరికి గెలిచేది నువ్వే’’

న్యూఢిల్లీ : పాశ్చాత్య దేశాల్లో ఉపయోగిస్తున్న కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతివ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. గతంలో దీని గురించి సూచించనపుడు ఎగతాళి చేశారని గుర్తు చేశారు. బుధవారం ఆయన ఇచ్చిన ట్వీట్లో తన సూచనలను మొదట నిర్లక్ష్యం చేసి, వెక్కిరిం చారని, ఇప్పుడు వాటినే పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. రష్యా తయారీ స్ఫుత్నిక్ వీ టీకా అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ప్ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా టీకాల్ని దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు స్వల్ప, స్థానిక భద్రతా పరీక్షలను నిర్వహించవలసిన అవసరం లేదు.గత వారం రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి రాసిన లేఖలో టీకాలు నత్తనడకన సాగుతోందని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. టీకాల కొరత ఉంది. టీకాలకు అనుమతులు వేగవంతం చేయాలని కోరారు. దీన్ని కేంద్ర న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎగతాళి చేసారు. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయ నేతగా విఫలమైన తర్వాత, ఫుల్టైమ్ లాబీయింగ్కు మారారా? అని ప్రశ్నించారు. మొదట ఆయన యుద్ధ విమానాల కంపెనీల కోసం లాబీయింగ్ చేశారు. యుద్ధ విమానాలను సేకరించే కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. యథేచ్ఛగా విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నార’ని ఆరోపించారు.దరిమిలా రాహుల్ గాంధీ బుధవారం చేసిన ట్వీట్లో ‘మొదట నిన్ను నిర్లక్ష్యం చేస్తారు, ఆ తర్వాత నిన్ను వెక్కిరిస్తారు, ఆ తర్వాత నీతో జగడ మాడతారు, చివరికి గెలిచేది నువ్వే’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos