కరోనా టీకా ఐచ్ఛికమే

కరోనా టీకా ఐచ్ఛికమే

న్యూ ఢిల్లీ: కరోనా టీకా వేసుకోవడం ఐచ్ఛికమేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం తప్పనిసరి కాదని వెల్లడించింది. కరోనా సోకినా లేకున్నా టీకా వేసుకోవటం మంచిదని హితవు పలికింది. దేశంలో కరోనా టీకా ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే ఓ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆరు టీకాలకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos