విదేశీ టీకాలకు మూడు రోజుల్లో అనుమతి

విదేశీ టీకాలకు మూడు రోజుల్లో అనుమతి

న్యూ ఢిల్లీ: విదేశీ టీకాల అత్యవసర వినియోగ అనుమతికి ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకున్న 3 పని దినాల్లోనే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని తీసుకోనుందని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఇక్కడ గురు వారం వెల్లడించింది. దీంతో నిర్ణయంతో విదేశీ నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన టీకాలు భారత్లో అడుగుపెట్టడం మరింత సులభంగా మారుతుంది. ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మిన్స్ట్రేషన్’ సిఫార్సు మేరకు టీకాల అత్యవసర అనుమతులను వేగవంతంగా పరిశీలించేందుకు అవసరమైన మార్గదర్శకాలను డీసీజీఐ నేతృత్వంలోని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) వెబ్సైట్లో ప్రకటిస్తుంది. విదేశీ టీకా సంస్థలు, భారత అనుబంధ సంస్థలు లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఏజెంట్ ద్వారా సీడీఎస్సీఓకు దరఖాస్తు చేసుకోవాలి. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ ఉపయోగ పడు తుందో లేదో అన్న విషయాన్ని సీడీఎస్సీవో పరిశీలించి మూడు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. దాని ఆధారంగా డీసీజీఐ తుది అనుమతులు మంజూరు చేస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos