ఆయుధాలు, యుద్ధ విమానాలు హెలికాప్టర్లను నిరుపయోగం చేసిన అమెరికా

ఆయుధాలు, యుద్ధ విమానాలు హెలికాప్టర్లను నిరుపయోగం చేసిన అమెరికా

కాబూల్ : తాలిబన్లకు ఆయుధాలు, వాహనాలు దక్కినా నిరుప యోగంగానే ఉండాలని అమెరికా ఆయుధాలు, వాహనాలను పనికి రాకుండా చేసింది. అక్కడి ఎయిర్ పోర్టులోని 73 విమానాల్లోని ఆయుధాలను తీసేశామని, విమానాలు పని చేయకుండా చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కెన్నెత్ మెకింజీ చెప్పారు.
‘‘ఆ విమానాలేవీ ఎగరలేవు. ఎవరూ వాటిని తిరిగి ఉపయోగించలేరు’’ అని చెప్పారు. 27 హమ్వీ వాహనాలనూ పాడు చేశామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రయో గించిన రాకెట్లను నాశనం చేసే సీ ర్యామ్స్ వ్యవస్థను చివరి నిమిషం వరకు వుంచుకున్న అమెరికా పోయే ముందు దానినీ నాశనం చేసింది. వదిలేసిన 70 ఎంఆర్ఏ పీ వాహనాలూ తాలిబన్లకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెప్పారు. ఒక్కో ఎంఆర్ఏపీ వాహనాల విలువ 10 లక్షల డాలర్లు. మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ లో అడుగు పెట్టే అవకాశాల దృష్ట్యా వాటిని పేల్చేయకుండా వెళ్లిపోయామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos