తాలిబన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన

తాలిబన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రకటించిన జాబితాలో తాలిబన్లు లేదా వారి సన్నిహిత సహచరులే ఉన్నారు. మహిళలు లేరని మేం గమనించాం. వీరిలో కొందరి చరిత్ర, వారి అనుబంధాలపై మేం ఆందోళన చెందుతున్నాం. వారి చర్యలను బట్టి అమెరికా తీర్పు నిస్తుంది. మాటలను బట్టి కాదు. ఆఫ్ఘని స్థాన్ పరిణామాలను ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోంది. ఇతర దేశాలను బెదిరించడానికి ఆఫ్ఘన్ గడ్డను వాడుకోకుండా తాలిబన్లు చర్యలు తీసుకుంటారని ఆశించిన’ట్లు అమె రికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. . తాలిబన్లు ప్రభుత్వాధినేత ముల్లా మహమ్మద్ హసన్ అకుండ్ ఐక్య రాజ్య సమితి బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. ఇంటీరియర్ మిని స్టర్ సిరాజుద్దీన్ హక్కానీ ఎఫ్బీఐ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos