పాత్రికేయుల‌పై ఆగ‌ని ఆగ‌డాలు

పాత్రికేయుల‌పై ఆగ‌ని ఆగ‌డాలు

లఖ్నవ్: ఉత్తర ప్రదేశ్లో పాత్రికేయులపై ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు జర్నలిస్టులకు వ్యతిరేకంగా కేసులు పెట్టి చెరసాల పాల్జేసింది. మరో దారుణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సంబంధింధిత వీడియో బహిర్గతం కావటంలో అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. రైలులో జరుగుతున్న అనధికారిక వ్యాపారులపై ఓ కథనాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన అమిత్ శర్మ అనే విలేకరిపై రైల్వే పోలీసు ఇనస్పెక్టర్ రాకేశ్ కుమార్ దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు. అమిత్ శర్మను రాకేశ్ తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియో రికార్డయ్యాయి. వార్తను చిత్రీకరిస్తున్న తనను, దారుణాతి దారుణంగా కొట్టారని, కెమెరాను ధ్వంసం చేశారని, స్టేషన్ కు తీసుకెళ్లి, లాకప్ లో వేసి బట్టలూడదీసి, నోటిలో మూత్రం పోసారని ఆరోపించారు. ఈ స్పందించిన రైల్వే ఉన్నతాధికార్లు రాకేశ్, మరో రైల్వే కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos