పంట అమ్ముకోకుండా అడ్డుకున్న బిజెపి పాలిత రాష్ట్రం

పంట అమ్ముకోకుండా అడ్డుకున్న బిజెపి పాలిత రాష్ట్రం

చంఢీఘర్ : రైతులు పంటను దేశంలోఎక్కడైనా అధిక ధరకు విక్రయించేందుకు . నూతన వ్యవసాయ చట్టాలు వెసలు బాటు కల్పిస్తాయని మోదీ సర్కార్ బెబుతోంది. అయితే ఇవి నేతి బీరకాయని తేలింది. భాజపా పాలిత రాష్ట్రాల్లోనే ఈ చట్టాలు పని చేయటం లేదు. యుపికి చెందిన 50 మంది రైతులు ధాన్యాన్ని హర్యానా ప్రభుత్వ మార్కెట్ యార్డులో విక్రయించేందుకు వెళ్లారు. హర్యానాలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి) అమలులో ఉండటంతో అధిక ధరకు విక్రయించవచ్చని రైతులు భావించారు. అక్కడి అధికారులు రైతులను అడ్డుకున్నారు. బాస్మతియేతర ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులను అడ్డుకోవాలని స్వయంగా కర్నల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. తమ రాష్ట్రంలోని రైతులకు అవకాశం కల్పించేందుకే ఈ విధంగా ఆదేశించినట్లు కమిషనర్ వెల్లడించారు. రైతులు ముందుగా పోర్టల్లో నమోదు చేసుకోవాలని, వారి వంతు వచ్చిన అనంతరం ఒక మెసేజ్ పంపుతామని హర్యానా ప్రభుత్వం పేర్కొంటోంది. గతంలో ఇటువంటి అడ్డంకులు కల్పించలేదని యుపి రైతులు వాపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నది బిజెపి ప్రభుత్వాలే అయినప్పటికీ కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా అమోదించిన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి మార్కెట్, ధరల నిర్ణాయాధికారం అంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళితే రైతులకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో అర్ధం చేసుకొవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos