మానవ హక్కుల ఉల్లంఘనపై విచరణ కోరిన ఐరాస

మానవ హక్కుల ఉల్లంఘనపై విచరణ కోరిన ఐరాస

న్యూయార్క్ : జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) యువజన అధ్యక్షుడు వహీద్ పారా నిర్బంధాన్ని కొనసాగించడంపై వివరించాలని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నిపుణుల బృందం భారత ప్రభుత్వాన్ని కోరింది. నిరుడు సెప్టెంబరు 15న సోపోర్ దుకాణాదారు ఇర్ఫాన్ అహ్మద్ దర్ కస్టడీలో వుంటుండగా హత్యకు గురి కావడం, యువకుడి నసీర్ అహ్మద్ వనీ అదృశ్యం కావడం పైనా సమాచారం కావాలని కోరారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఐదుగురు నిపుణులు మార్చి 31న ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఇటీవల బహిరంగపరిచారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో గతేడాది నవంబరు 25న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) పారాను అరెస్టు చేసింది. జిల్లా అభివృద్ది మండలి ఎన్నికలకు నామినేషన్ వేసిన మూడు రోజులకే అరెస్టు జరగడంతో దానిపై అనుమానాలు తలెత్తాయి. గత ఏడాది జులై 30న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులు పాల్గొన్న ఒక వెబినార్లో పారా కూడా హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో, ముస్లిం మైనారిటీల పట్ల భారత ప్రభుత్వ నిరంకుశ చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే పారాకు ఎన్ఐఎ అధికారుల బెదిరించారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కోరి సమస్యలను తెచ్చుకుంటున్నారని, ప్రభుత్వం గురించి మాట్లాడడం మానకపోతే చర్యలు తప్పవని వారు హెచ్చరించారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. నిర్బంధంలో వున్నపుడు పిడిపి యువజన నేత పట్ల అణచివేత వైఖరి ప్రదర్శించడాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos