నిధుల నిలిపివేతకు ఇది సమయం కాదు

నిధుల నిలిపివేతకు ఇది సమయం కాదు

వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేయడానికి ఇది సరైన సమయం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బుధవారం వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓకు తమ వంతు వాటాను నిలిపివేపినట్లు అమెరికా చేసిన ప్రకటనకు ఈ మేరకు స్పందించారు. కరోనా కు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం తిరుగులేని పోరాటం చేస్తున్న సమయంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని గుటెరస్ హితవు పలికారు. పాత అంశాలు తవ్వుకోవడానికి ఇది తరుణం కాదంటూ డబ్ల్యూహెచ్ఓకు అండగా నిలవాలన్నారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయటంతో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. దరిమిలా సంస్థకు ఇచ్చే నిధుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘చైనాకు పక్షపాతిగా వ్యవహరిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికే ముప్పు తెచ్చింద’ని తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రపంచంలో అమెరికాయే అతిపెద్ద బాధిత దేశం. అక్కడ ఇప్పటి వరకు 6,12,576 మందికి వైరస్ సోకగా.. వీరిలో 29,798 మంది మృతిచెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos