మద్యం, మగువ చట్ట బద్ధం

మద్యం, మగువ చట్ట బద్ధం

దుబాయ్ : కఠిన చట్టాలకు పెట్టింది పేరైన ఇస్లామిక్ దేశాలతో కూడిన యూఏఈ పెట్టుబడుల్ని, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మద్యపానం సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది. అవివాహిత జంటలు ఒకేచోట నివసించేందుకు అనుమతించడంతో పాటు మద్యపానంపై నియంత్రణలను సరళతరం చేస్తూ ఇస్లామిక్ వ్యక్తిగత చట్టాల్లో ఈ మేరకు సవరణలు చేసింది. గతంలో మద్యాన్నిసేవించినా, మద్యాన్ని కలిగి ఉన్నా నేరంగా పరిగణించేవారు. తాజా నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. నూతన చట్టాలు పురోగమనానికి దారితీస్తాయని, ఈ ఏడాది పలు సవాళ్లు ఎదురైనా కీలక మార్పులకు నాందిపలికిందని అల్జజీరా టీవీ వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos