‘అక్కడి కక్కడే కొడతా’

‘అక్కడి కక్కడే కొడతా’

శ్రీకాకుళం: శాసనసభాపతి తమ్మినేని సీతారాం తీరు మరోసారి వివాదాస్పదమైంది. గురువారం ఇక్కడ జరిగిన జ్యోతిభా పూలే వర్ధంతి కార్యక్రమంలో శిష్టాచారాన్ని పాటించలేదని వెనుకబడిన సంక్షేమ శాఖ అధికార్లపై విరుచుకు పడ్డారు.‘ఇంకోసారి ఇలాం టి తప్పు జరిగితే అక్కడి కక్కడే కొడతానని గట్టి హెచ్చరించా’రు. తమ్మినేని ఆగ్రహంతో అధికారులంతా నిర్ఘాంతపోయారు. సమయా భావం వల్ల సమాచారం ఇవ్వలేకపోయామని అధికారులు సంజాయిషీ ఇచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తించు కోండ’ని హెచ్చరించారు. ఇటీవల ఆయన విపక్ష నేత చంద్ర బాబు, సోనియా గాంధీకి వ్యతిరేకంగా వాడిన భాష తీవ్ర దుమారం రేపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos