ఫిరాయింపు నేతలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే..

ఫిరాయింపు నేతలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే..

ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నియోజకవర్గ ప్రజల అభిమతం మేరకు లేదా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల,చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీ మారుతున్నామంటూ ప్రకటనలు చేసి ఏమాత్రం సంకోచం లేకుండా పార్టీ ఫిరాయించడం ప్రస్తుతం రాజకీయాల్లో పరిపాటిగా మారింది.దేశంలో ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తుంది.గత ఏడాది తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇదే కారణాలతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతో తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండాపోయింది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై,ఫిరాయింపులను ప్రోత్సహించిన తెరాసపై కాంగ్రెస్‌ నేతలు నిరసనలు,దీక్షలతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ప్రజల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఈ క్రమంలో తమకు భద్రతను పెంచాల్సందిగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు.ఇద్దరు ఎమ్మెల్యేల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఇద్దరికి 4+4 గన్‌మెన్‌లను కేటాయించారు.ప్రజల ఆకాంక్ష,నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామంటూ ప్రకటన చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన నియోజవకర్గ ప్రజలే పార్టీ ఫిరాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడవపై ఏం సమాధానం చెబుతారో..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos