ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి..

ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి..

  వచ్చే నెలలో జరుగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా తెరాసను విజయతీరాలకు చేర్చాలంటూ సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సంబంధించి చర్చించారు.మరికొద్ది రోజుల్లో మునిసిపల్‌ ఎన్నికల యుద్ధం రానుందని ఈ యుద్ధాన్ని ఎదుర్కునేందుకు నేతలు,కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ సూచించారు. నైపుణ్యంతో, చతురతతో ఎన్నికలను గెలవాలని సూచించారు.ఎన్నికలు, అభివృద్ధి అనే రెండు అంశాలు వేర్వేరు అని దేని దారి దానిదేనని చెప్పుకచ్చారు.ఉభయ సభలలో కొత్త మున్సిపల్ చట్టాన్నిఆమోదించుకున్న తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు.ఆగష్టులో జరుగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా  పరిషత్ ఎన్నికల్లో గెలిచినట్లే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీలను గురి చూసి కొడితేనే విజయం సాధిస్తామని ఎదుటి వాడి బలాలు బలహీనతలను అర్థం చేసుకుని విజయం దిశగా అడుగులు వేయాలంటూ సూచించారు.అత్యవరమైతే తప్ప ఎవరు కూడా ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్‌లో అడుగుపెట్టవద్దంటూ మంత్రులకు ఆదేశించారు.ఇదే సమావేశంలో బీజేపీపై,ప్రధాని నరేంద్రమోదీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌.భారత ప్రధాని నరేంద్రమోదీపై తెరాస అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. మోదీ దేశానికి ఏమి చేయలేదని అసలు మోదీ దేశాభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా మోదీ పనితీరుపై చర్చలు జరగడం లేదని కేవలం జాతీయత,దేశభక్తి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచారంటూ ధ్వజమెత్తారు.తన మాటలతో హావభావాలతో ప్రజలను భ్రమలకు గురి చేసి గెలిచారని బీజేపీ అధికారంలోకి రాకపోతే దేశానికి రక్షణ లేదంటూ ప్రజలను మాయ చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, శక్తివంతమైన పార్టీగా టీఆర్ఎస్ ఇప్పటికే అవతరించిందని రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇకపై జరిగే ఏ ఎన్నికల్లో కూడా తెరాసకు బీజేపీ పార్టీ ప్రత్యర్థి కాదని బీజేపీకి అంత సీన్‌ లేదంటూ తేల్చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos