మాకు మేమే ప్రత్యామ్నాయం

మాకు మేమే ప్రత్యామ్నాయం

హైదరాబాద్‌ : తెలంగాణలో కాలం చెల్లిన నాయకుల వల్ల భాజపాకు ఒరిగేదేమీ ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాసకు తెరాసనే ప్రత్యామ్నాయమన్నారు. కార్యకర్తల బలం లేకుండా కేవలం ఎవరో నాయకులు చేరినంత మాత్రాన భాజపాకు ఒరిగేదేమీ ఉండదని అన్నారు. అసలు కాంగ్రెస్‌కు ఉన్నంత ఓటు బ్యాంకు భాజపాకు లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెత్తనం పురపాలక ఎన్నికల్లో పనిచేయదని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనేది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తన కుమారుడు సాయి కిరణ్‌కు మేయర్‌ పదవి అడిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమన్న భాజపా, ఇప్పుడు కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నా ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos