తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైదరాబాదు:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.12.30 గంటల ప్ప్రాంతంలో తొలి రౌండ్‌లో 23 డివిజన్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఇందులో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. ఆర్సీపురంలో , పటాన్ చెరువు డివిజన్లు, చందా నగర్, హఫీజ్ పేట‌, హైదర్ నగర్, జూబ్లి హీల్స్, ఖైరతాబాద్, బాలానగర్, ఓల్డ్ బోయినపల్లి, చర్లపల్లి, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. 12 చోట్ల మాత్రం బీజేపీ ఆధిక్యం కనబర్చింది.పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం బీజేపీ ఆధిక్యం కొనసాగింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. 46 డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ లీడంగ్ సాధించింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బట్టి ఓటింగ్ సరళిని అంచనా వేయలేమని పలువురు అన్నారు.  డిసెంబర్ 1న పోలింగ్ జరిగింది. మొత్తం 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 18,60,400 మంది పురుషులు తమ ఓటు వేయగా, 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos