పార్లమెంటుకు ట్రాక్టరుపై వచ్చిన రాహుల్

పార్లమెంటుకు ట్రాక్టరుపై వచ్చిన రాహుల్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. సోమవారం ఉదయం రాహుల్ గాంధీ ట్రాక్టరు నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టరు నడిపిన రాహుల్ తన మద్ధతు ప్రకటించారు.రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020, రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం, 2020, ఎసెన్షియల్ కమాడిటీస్ (సవరణ) చట్టం 2020 చట్టాలను సెప్టెంబరులో పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాల వల్ల రైతులకు మద్ధతు ధర రాదని రైతు సంఘాలు ఆరోపించాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు రాహుల్ గాంధీ మరోసారి మద్ధతు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos