నాటి వాతాపి..నేటి బాదామి..

  • In Tourism
  • December 1, 2019
  • 293 Views
నాటి వాతాపి..నేటి బాదామి..

పాత బొంబాయి రాష్ట్రంలోని ప్రాంతం.. ప్రస్తుతం ఉత్తర కర్ణాటకలో భాగంగా ఉన్న భాగల్కోటె జిల్లాకు చెందిన బాదామి ప్రాంతం పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. బాదామితో దాని చుట్టుపక్కల పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిలయాలుగా భావిస్తారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి యాత్రికులు వచ్చి చూసి వెళ్తుంటారు. దీనికి తోడు వేసవిలో ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుంది. శీతాకాలంలో అయితే 15 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇక్కడి వాతావరణం కోతులకు మిక్కిలి అనువైందిగా స్థానికులు చెబుతారు. దీంతో అక్కడ కోతు సంతతి విపరీతంగా పెరిగింది. కాగా చారిత్రక బాదామి, ఐహొళె, పట్టదకల్ప్రాంతాలతో చారిత్రక నగరాల మహా సమాహారం.. కర్ణాటక పర్యాటక మణిహారంగా మారింది. బౌద్ధ గుహలోకి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్లగలం. కొండపై నిర్మించిన బాదామి కోటను చూడవచ్చు. బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు అందంగా ఉంటాయిబాదామి, ఐహోల్, పత్తడకల్ప్రాంతాల నుంచి సేకరించిన శిల్పాలతో ఏర్పాటు చేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం) చూసి రావచ్చు.

వాతాపి చరిత్ర..
బాదామికి అప్పట్లో వాతాపి అనే పేరుండేది. వాతాపి, ఇల్వాల అనే ఇద్దరు రాక్షసులు తమ మోసంతో ప్రజల్ని ఆరగించేవారు. అతిథులకు ఇద్దరు రాక్షసులు కలిసి మోసగించేవారని స్థానికులు చెబుతారు. వాతాపిని తన సోదరుడు సంహరించి వంటకంగా వండిపెట్టేవాడు. అతిథి దీన్ని భోజనం చేసిన తర్వాత సోదరా.. వాతాపీ అని పిలిస్తే అతిథి కడుపును చీల్చుకుని వెలుపలికి వచ్చేవాడు. అతిథి మరణించేవాడు. విధంగా తొమ్మిది వేల మందిని సంహరించారని స్థానికులు కథలుగా వివరిస్తారు. వీరి మోసాన్ని గుర్తించిన అగస్త్య మహర్షి భోజనం చేసిన అనంతరం కడుపును నిమురుకుంటూ వాతాపి జీర్ణం.. వాతాపి జీర్ణం అని స్తోత్రాన్ని చెప్పాడట. ఫలితంగా కడుపులో ఉన్న వాతాపి జీర్ణమయ్యాడట

 ఆకట్టుకునే బాదామి గుహలు :
పురాతన కాలంలో చాళుక్యులు అద్భుతమైన గుహాలయాలను బాదామిలో నిర్మించారు. కొండను తవ్వి ఆలయాలను నిర్మించడం ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తుంది. విష్ణువు, పార్శ్వనాథుడు, బాహుబలి విగ్రహాలను గుహల్లో చూసి ఆనందించవచ్చు. చాళుక్యుల రాజధాని నగరంగా మారిన నేటి బాదామి పట్టణంతో పాటు సమీపంలోని ఐహొళె యునెస్కోచే వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఆలయాల సమూహం పట్టదకల్, సమీపంలోనే ఉన్న మహాకూట ప్రాంతాల్ని చూసి పర్యటన ముగించుకుని వెళ్లవచ్చు. సుమారు ఏడు ఆలయాల సమూహంతో పట్టదకల్లో ఉత్తర దక్షిణ ప్రాంతాల శైలితో నిర్మాణం కొనసాగింది. దీంతో వారసత్వ సంపద గుర్తింపు లభించిందని స్థానికుల అభిప్రాయం.

బాదామి గుహలు

అగస్త్య లేక్‌..
బాదామి గుహల నుంచి కేవలం ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్న అగస్త్య లేక్‌ బాదామిలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.ఐదో శతబ్దాంలో నిర్మించిన చెరువు నీటిలో స్నానం చేస్తే ఎన్నో నయం కాని జబ్బుల నయమవుతాయని స్థానికుల నమ్మకం.శ్రీవిష్ణువు,లక్ష్మీదేవి,భూదేవిలకు ప్రీతిపాత్రమైన ప్రాంతం కావడంతో గరుత్మంతుడు అగస్త్య చెరువును నిర్మించాడని స్థలపురాణం..

అగస్త్య లేక్

ఐహొళె:
బుద్ధిజం,హిందూ,జైన మతాల ఆలయాలతో విరాజిల్లుతున్న ఐహొళెను ఐవళి ,అహివొలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.ఆరో శతాబ్దంలో నిర్మితమైన ఐహొళెలోని దేవాలయాలపై శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదంటే ఆతిశయోక్తి కాదు.ఐహొళెలోని 16 ఫ్రీ స్టాండింగ్‌ ఆలయాలు,రాతితో నిర్మించిన నాలుగు గాలిగోపురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.క్షత్రియులను సంహరించిన అనంతరం పరశురాముడు తన గొడ్డలిని ఐహొళెలోని నదీ తీరంలో కడగడంతో ఇక్కడి నీరు ఇప్పటికీ ఎర్రగా ఉంటుందని స్థానిక చరిత్ర..

ఐహొళె

భూతనాథ ఆలయం :
అగస్త్య చెరువుకు తూర్పు వైపు ఉన్న మట్టితో నిర్మించిన  భూతనాథ ఆలయం నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆలయంలోని మండపాన్ని రెండు గదులుగా విభజించేలా నిర్మించిన భారీ స్తంబాలు వాటిపై చెక్కిన కమలం పుష్పాల ఆకారం అద్భుతంగా ఉంటుంది.
పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బాదామి చేతులతో తయారు చేసిన చేనేత ఉత్పత్తులు,దుప్పట్లు,రోస్‌ఉడ్‌,శ్రీగంధం ఉత్పత్తులకు కూడా అంతే ప్రసిద్ధి చెందింది. బాదామి పర్యటనకు వెళితే అక్కడ లభించే ఇటువంటి ఉత్పత్తులను కొనడం మర్చిపోవద్దు..

భూతనాథ ఆలయం

కమలం పుష్పాల ఆకారం

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos