బ్రాండ్‌ విలువలో కోహ్లీనే టాప్‌

  • In Sports
  • January 11, 2019
  • 184 Views
బ్రాండ్‌ విలువలో కోహ్లీనే టాప్‌

ముంబై: దేశంలో అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన జాబితాలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండోసారీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు 2017 కంటే ఈసారి అతడి విలువ 18 శాతం పెరిగి రూ.12 వందల కోట్లకు చేరింది. డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకా రం.. గతేడాది నవంబరు వరకు కోహ్లీ ఖాతాలో 24 బ్రాండ్లు ఉన్నాయి. ఇక 21 బ్రాండ్లు కలిగిన బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌ (రూ.722 కోట్లు) రెండో స్థానంలో ఉంది. 700 కోట్ల రూపాయల క్లబ్‌లో వీరిద్దరే ఉండడం విశేషం. మరోవైపు గత సంవత్సరం రెం డో స్థానంలో ఉన్న షారుఖ్‌ ఖాన్‌ (రూ.427 కోట్లు) ఐదో స్థానానికి పడిపోయాడు. ధోనీ (రూ.189 కోట్లు) 12వ స్థానంలో, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు (రూ.152 కోట్లు) 15వ స్థానంలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos