రైతులపై లాఠీ ఛార్జి

రైతులపై లాఠీ ఛార్జి

భోపాల్ : నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, స్థానిక లోక్ సభ సభ్యుడు నరేంద్ర తోమర్ వాహన శ్రేణిని అడ్డుకున్న రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. షియోపూర్కు మంత్రి వస్తున్నట్లు సమాచారం తెలియగానే యునైటెడ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యాన రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు పలువురు రైతునేతల్ని అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. అజాక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాలి రోడ్ వద్దకు కేంద్ర మంత్రి కాన్వారు రాగానే, యునైటెడ్ కిసాన్ మోర్చా ప్రతినిధి అనిల్ సింగ్ చౌదరితో పాటు రైతులు తోమర్ కారును చుట్టుముట్టారు. నల్ల జెండాలతో నిరసించారు. నల్లచట్టాలు వెనక్కితీసుకోవాలని నినదించారు.‘మేము బిజెపికి ఓటు వేశాం. ఇప్పుడు రైతుల సమస్యను ప్రస్తావించటం తప్పా’ని రైతు ప్రతినిధులు ప్రశ్నించారు. అక్కడ ఉన్న కలెక్టర్ రాకేశ్ కుమార్ శ్రీవాస్తవ రైతుల్ని నెట్టివేశారు. కలెక్టరే రెచ్చిపోవటంతో పోలీసులు కేకలు వేస్తూ అన్నదాతల్ని దొరికిన వారిని దొరికినట్టు లాఠీలతో బాదారు. సుమారు అరగంటసేపు కేంద్ర మంత్రి వాహనాలు నిలిచిపోయాయి. భాజపా ముర్దాబాద్ అంటూ నిరసన ప్రదర్శన కొనసాగుతుండగానే.. మంత్రి పోలీసుల రక్షణవలయంలో బైపాస్ రోడ్డుపైనుంచి వెళ్లిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos