రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం ఫుటేజ్‌లు లభ్యం..

రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం ఫుటేజ్‌లు లభ్యం..

ఔటర్‌ రింగ్‌ రోడ్డపై నార్సింగి సమీపంలో యువనటుడు రాజ్‌తరుణ్‌ కారుకు ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌లు సంపాదించారు.ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి కారుని వదిలేసి వెళ్లిపోతున్న వ్యక్తి హీరో రాజ్ తరుణ్ అని సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.ఆటోమేటిక్ గేరు ఉన్న కారు కావడంతో సాంకేతికంగా ఎలా నడపాలో తెలియక.. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు స్పీడ్ గా వెళ్లి డివైడర్ ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. చిన్న చిన్న గాయాలతో రాజ్ తరుణ్ బయటపడ్డాడు.ప్రమాదం జరిగిన తరువాత కారుని అక్కడే వదిలేసి రాజ్ తరుణ్ పరుగులు తీసినట్లు ఫుటేజ్‌లో తెలుస్తోంది.నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos