తీరథ్ కు పదవి గండం

తీరథ్ కు పదవి గండం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్కు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. తీరథ్ సింగ్ రావత్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాక పోవటం ఇందుకు కారణం. వచ్చే సెప్టెంబర్ 9 కి ఆయన పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తోంది. శాసనసభ ఎన్నికలు జరగడానికి ఏడాది కంటే తక్కువ కాలం ఉన్నందున ప్రజా ప్రాతినిధ్య చట్టం 151 ఎ సెక్షన్ కింద ఉప ఎన్నికలు నిర్వహణకు అవకాశం లేదు. దరిమిలా కొత్త ముఖ్యమంత్రి అనివార్యం. గత మార్చిలో బీజేపీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos