ఆ పులిని చంపేది లేదు…

ఆ పులిని చంపేది లేదు…

చామరాజనగర : ఇద్దరిని చంపి తిన్న పులి కోసం కర్ణాటక అటవీ శాఖ వేట మొదలు పెట్టింది. పులి జాడను కనుక్కోవడానికి ఏనుగులను ఉపయోగిస్తున్నట్టు బండిపుర టైగర్ రిజర్వు ఫారెస్ట్ డైరెక్టర్ టి. బాలచంద్ర తెలిపారు. పులిని గుర్తించిన తర్వాత దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకుంటామని వెల్లడించారు. గత ఏడాది అవ్నిల్ అనే ఆడపులిని హతమార్చి అపఖ్యాతి మూటగట్టుకున్న మహారాష్ట్రకు చెందిన వేటగాడు షఫత్ అలీ ఖాన్, ఇప్పుడీ పులిని పట్టుకునేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా తిప్పి పంపినట్టు సమాచారం. అటవీ అధికారులు వెతుకుతున్న ఈ పులి ఇప్పటి వరకు ఇద్దరిని పొట్టనపెట్టుకోగా, చామరాజ నగర జిల్లాలో 14 పశువులను ఆరగించింది. ఈ పులిని హతమార్చడానికి ఆదేశాలు ఉన్నాయన్న వార్తలను అధికారులు కొట్టిపడేశారు. అలాంటిదేమీ లేదని, దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకోమనే ఆదేశాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. దీని జాడను కనుక్కోవడానికి అడవిలో ఇప్పటికే అదనంగా 100 కెమెరాలు బిగించగా, మరో 50-60 కెమెరాలు బిగించాలని వేట బృందం భావిస్తోంది. ఈ బృందంలో మరో మూడు ఏనుగులు, ఇద్దరు పశు వైద్యులను కూడా చేర్చాలని అధికారులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos