జత కోసం 2 వేల కిలోమీటర్లు అన్వేషణ

జత కోసం 2 వేల కిలోమీటర్లు అన్వేషణ

భువనేశ్వర్: ఆవాసం కోసం రాయల్ బెంగాల్ టైగర్ నాలుగు రాష్ర్టాలను చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది. లేళ్లు, దుప్పులు వంటి జంతువులు పుష్కలంగా ఉండే ప్రదేశం కోసం అన్వేషించింది. అదే సమయంలో తనతో జత కట్టే పులి కోసం కూడా అన్వేషణ జరిపింది.ఒడిశాలోని పర్లాఖెముండి ఫారెస్ట్ డివిజన్కు చెందిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ ఆనంద్ మాట్లాడుతూ, ఈ పులి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఇది ప్రయాణించినపుడు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. కుమిలిసింగి బీట్లో ఏర్పాటు చేసిన కెమెరాలో దీనిని గుర్తించి, ఆ చిత్రాలను వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కు పంపినట్లు తెలిపారు. ఈ పులి దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు డబ్ల్యూఐఐ నిర్ధారించిందని తెలిపారు. మానవుల వేలిముద్రల మాదిరిగానే పులుల చారలు కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos