ఉత్తరాంధ్రకు ఉరి. అమెరికాకు సిరి

ఉత్తరాంధ్రకు ఉరి. అమెరికాకు సిరి

శ్రీకాకుళం : కొవ్వాడ అణు పార్కు ఉత్తరాంధ్రకు ఉరి. అమెరికాకు సిరి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు ఆక్రోశించారు. వినాశకర కొవ్వాడ అణు పార్కును వెంటనే రద్దు చేయాలని డిమాండు చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం చిలకపాలెంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.‘ కొవ్వాడలో అణుపార్కు పెట్టడమంటే శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమే. ఏ చిన్న ప్రమాదం జరిగినా కాకినాడ నుండి ఛత్రాపూర్ వరకు జీవకోటి సర్వనాశనం అవుతుంది. తెదేపా ప్రభుత్వం అణు పార్కు నిర్మాణానికి ఉత్తర్వుల్ని జారీ చేసి ప్రజల్ని వంచించింది. వైకాపా ప్రభుత్వం అణుపార్కును నిర్మించబోమని శాసనసభలో ప్రకటించాలి. గుజరాత్, మితివిర్దిలో పెట్టాల్సిన అణు పార్కును అక్కడ రైతులు, ప్రజలు వ్యతిరేకత వ్వల కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొవ్వాడకు తరలించింది. అభివృద్ది చెందిన అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు అణువిద్యుత్తు కేంద్రాలు ప్రమాదకరమని మూసివేస్తుంటే ఇక్కడి పాలకులు వాటి ఆరంభించటంలో ఆంతర్యం ఏమిటి? అమెరికా, కరోలినా రాష్ట్రంలో అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి సుమారు 50 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలో నిర్మాణం నిలుపుదల చేశారని డి.గోవిందరావు గుర్తు చేశారు.. అణువిద్యుత్తు యూనిట్ ధర రూ.20 . నీరు, గాలి, సూర్యరశ్మితో చౌకగా విద్యుత్ తయారు చేయ వచ్చు. అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్రం ప్రభుత్వం కొవ్వాడ అణుపార్కు పెడుతుంద’ని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos