శశి థరూర్‌ ఇదేం బుద్ధి

శశి థరూర్‌ ఇదేం బుద్ధి

న్యూఢిల్లీ : రచయిత, వక్త, మేధావిగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు శశి థరూర్ ఒక ట్వీట్తో సోమవారం చాలా మంది ఆగ్రహానికి గురయ్యారు. తోటి మహిళా సభ్యులు అందచందాలు, ఆకర్షణీయత గురించి సాధారణ వ్యక్తి మాదిరి వ్యాఖ్యానించటం దీనికి కారణం. చాలా సంతోషంతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇటు వంటి తిరోగమన వ్యాఖ్యలను మానుకోవాలని సలహా ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనపుడు ఆయన ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశారు. లోక్సభ ఆకర్షణీయ పని ప్రదేశం కాదని ఎవరు అంటారని ప్రశ్నించటం ఆగ్రహావేశాలకు కారణమైంది. సెల్ఫీలో సుప్రియా సూలే (ఎన్సీపీ), ప్రెనీత్ కౌర్ (కాంగ్రెస్), తమిళచి తంగ పాండ్యన్ (డీఎంకే), మిమి చక్రబర్తి (టీఎంసీ), నుస్రత్ జహాన్ (టీఎంసీ), జోతిమాన్ సెన్నిమలై (కాంగ్రెస్) ఉన్నారు. ఫొటో వ్యాఖ్యా దుమారాన్ని రేపింది. మహిళల పట్ల వివక్షతో వ్యవహరించారని కారాలు మిరియాలు నూరారు. మహిళా ఎంపీల చొరవతోనే చాలా సరదాగా ఈ సెల్ఫీ తీసుకున్నా, వారే ఈ ఫొటోను ట్వీట్ చేయాలని కోరినట్లుశశి థరూర్ తెలిపారు. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందుకు క్షమాపణ కోరారు. ఈ సెల్ఫీని మిమి చక్రవర్తి తీసినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఉన్న లేదా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను తక్కువ చేసి చూపుతున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ మండి పడ్డారు. ‘ఆకర్షణీయంగా ఉండటమే ప్రధాన సూత్రం, ప్రమాణం అని చెప్తున్నట్లు కనిపిస్తోంది. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారనేదానితో సంబంధం లేద’న్నారు. ‘ ఫొటో చాలా బాగుందని, అయితే క్యాప్షన్ మాత్రం అంత బాగులేద’ని మరో ట్విట్టర్ అన్నారు. దీనిని కొందరు అభ్యుదయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇటువంటి తిరోగమన క్యాప్షన్లను నివారించాలన్నారు. వాటిని మహిళల చొరవతో పెట్టినప్పటికీ నివారించాలని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos