చడీచప్పుడు లేకుండా తారకరత్న కొత్త చిత్రం విడుదల

  • In Film
  • July 5, 2019
  • 83 Views
చడీచప్పుడు లేకుండా తారకరత్న కొత్త చిత్రం విడుదల

కెరీర్‌ మొదట్లోనే ఒకేసారి తొమ్మిది చిత్రాలను ప్రారంభించి రికార్డు సృష్టించి అనంతరం ఒక్కో చిత్రంతో కిందికి పడిపోతూ కొద్ది కాలానికి పూర్తిగా కనుమరుగైన నందమూరి హీరో తారకరత్న నటించిన కాకతీయుడు చిత్రం శుక్రవారం ఎటువంటి సందడి లేకుండా థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రస్తుతం తారకరత్న మార్కెట్‌ పూర్తిగా పడిపోవడంతో ఈ చిత్రం విడుదలవుతున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు తొమ్మది సినిమాలకు సైన్ చేసిన తారకరత్న ఇప్పుడు అవకాశాల్ని అందుకోవడమే కష్టంగా మారింది.2015లో పూర్తయిన కాకతీయుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అప్పట్లో దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. అలాగే ఆ తరువాత రిలీజ్ చేద్దామని అనుకున్నా బిజినెస్ లేక మూలన పడింది. మొత్తానికి నేడు విడుదల చేసినప్పటికీ  థియేటర్స్ లో కూడా జనాలు కనిపించడం లేదు. ఒకప్పుడు సింహారాశి – శివరామరాజు – ఎవడైతే నాకేంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.సముద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మినిమమ్ గ్యారెంటీ ఉన్న ఈ దర్శకుడు కాకతీయుడుని పెద్దగా మెప్పించేలా తెరకెక్కించలేకపోయాడు. నిజంగా ఈ సినిమా రిలీజ్ కాకపోయినా బావుండేదేమో.. సినిమా ఆడదాని తెలిసినా ఈ ప్రయోగాలు చేయడం ఎందుకో?అసలు ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్నట్లు కనీసం చిత్రంలో హీరోగా నటించిన తారకరత్నకైనా తెలుసు లేదో?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos