టకియా తొలగించకుంటే థియేటర్ల దహనం తప్పదు

టకియా తొలగించకుంటే థియేటర్ల దహనం తప్పదు

హైదరాబాదు: ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్లో ఎన్టీఆర్ కనపడిన ముస్లిం వేష ధారణ పట్ల భాజపా ఎంపీ సోయం బాపూరావు మండి పడ్డారు. ఎన్టీఆర్ ధరించిన టకియాను తొలగించాలని డిమాండు చేసారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే అవి ఆడే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. సినిమా వసూళ్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఊరుకోబోమని చెప్పారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన భీమ్ను చంపిన వాళ్ల టోపీని ఆ పాత్ర పోషిస్తున్న వ్యక్తికి పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని మండి పడ్డారు. దర్శకుడు రాజమౌళి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. భీమ్ పాత్రలో కనపడిన ఎన్టీఆర్ టకియాను ధరించడం పట్ల పలు ఆదివాసీ సంఘాలు కూడా మండి పడ్డ విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos